బాలికపై విద్యార్థుల అత్యాచారం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో 11 ఏళ్ల బాలికపై 11, 12 తరగతి చదువుతున్న విద్యార్థులు  అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జూలైలో జరిగితే తాజాగా బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. అయితే జరిగిన ఘోరం గురించి బాధిత బాలిక  ఆ రోజే టీచరుకు చెప్పినప్పటికీ.. స్కూలు యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో ఇన్నాళ్లూ బయటపడలేదు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో జూలైలో ఆ బాలిక ఒకరోజు ఆమె తన తరగతి గదికి వెళ్తుండగా, పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొంది. వారిద్దరూ 11, 12 తరగతుల విద్యార్థులు. వెంటనే వారికి క్షమాపణ చెప్పినప్పటికీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆమెను మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి తలుపు గడియపెట్టి అత్యాచారం చేశారు. బాలిక ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పగా.. ఆ అబ్బాయిలిద్దరినీ బడి నుంచి బహిష్కరించామని, దీనిపై ఎక్కడా మాట్లాడొద్దని టీచర్‌ చెప్పినట్లు బాలిక పేర్కొంది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్‌.. పోలీసులకు, ప్రిన్సిపాల్‌కు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. 'దేశ రాజధానిలో చివరికి బడిలో కూడా పిల్లలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలి. స్కూలు అధికారుల పాత్రపై తప్పనిసరిగా విచారణ జరగాలి' అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ అన్నారు. కాగా  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)