బురఖా ధరించి తిరుగుతున్న పూజారి !

Telugu Lo Computer
0


కేరళలో ఓ ఆలయ పూజారి బురఖా ధరించి రోడ్డుపై తిరుగుతున్నారు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కోయిలాండిలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. మెప్పయూర్ సమీపంలోని ఆలయంలో 28 ఏళ్ల జిష్ణు నంబూతిరి పూజారిగా ఉన్నారు. ఈ నెల 7న ముస్లిం మహిళలు ధరించే బురఖాను అతడు ధరించారు. ఆ దుస్తుల్లో కోయిలాండి జంక్షన్‌ వద్ద తిరుగుతున్నారు. అయితే బురఖాలో ఉన్న పూజారి జిష్ణు నంబూతిరిని స్థానిక ఆటో డ్రైవర్లు గమనించారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బురఖా ధరించి తిరుగుతున్న పూజారి జిష్ణు నంబూతిరిని పోలీసులు ప్రశ్నించారు. తనకు 'చికెన్ పాక్స్‌' ఉందని అందుకే బురఖా ధరించినట్లు అతడు చెప్పారు. అయితే ఆ పూజారి శరీరంపై ఆ వ్యాధి లక్షణాలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో అతడి పేరు, చిరునామా ఇతర వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. అతడి బంధువులు కూడా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు వివరించారు. బురఖా ధరించి తిరుగుతున్న పూజారిపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. ఈ నేపథ్యంలో పూజారి జిష్ణు నంబూతిరిని పంపేసినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)