లోయలో పడ్డ యాపిల్ లోడు లారీ !

Telugu Lo Computer
0


హిమాచల్‌ప్రదేశ్ లోని సోలన్‌ జిల్లా కందఘాట్ దగ్గర యాపిల్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన లారీ పల్టీలు కొడుతూ కిందకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లారీ బరువుతో ఉండటం, అనేక పల్టీలు కొట్టడం కారణంగా క్యాబిన్ పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)