జనాభా నియంత్రణ అవసరం !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విజయదశమి వేడుకలను ఆర్ఎస్ఎస్ భారీ ఎత్తున నిర్వహించింది. విమెన్ మౌంటెనీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంతోష్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1992, 1993లో రెండుసార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఓ మహిళ ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ  దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని, ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జనాభా పెరిగిపోవడం వల్లే మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీన్ని నియంత్రణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీనికోసం జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. స్వార్థం, ద్వేషం ప్రాతిపదికన సమాజంలోని వివిధ వర్గాల మధ్య దూరాన్ని, శత్రుత్వాన్ని సృష్టించే చర్యలు యథేచ్ఛగా సాగుతున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. భాష, మతం, ప్రాంతం, విధానంతో సంబంధం లేకుండా, వారు చేసే ఉపన్యాసాల మాయాజాలంలో చిక్కుకోకూడదని అన్నారు. మనుషుల మధ్య శతృత్వాన్ని పెంచే వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సి ఉందని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)