కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఉపసంహరణ

Telugu Lo Computer
0


కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్యా హరిదాస్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశ పెట్టిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. హౌస్‌లోకి ప్లకార్డులు తీసుకురాబోమన్న హామీ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్న తర్వాత ధరల పెంపుపై చర్చ కొనసాగుతోంది. ధరల పెంపు, నిత్యావసరాలపై జీఎస్టీ వంటివాటిని వ్యతిరేకిస్తూ గతవారం కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ ఈ సమావేశాలు ముగిసే వరకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్యాహరిదాస్‌లను సమావేశాలు ముగిసేంత వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్  ఆందోళనకు దిగింది. దీంతో స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ప్లకార్డులు ప్రదర్శించి నిరసనకు దిగబోమని హామీ ఇస్తే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చిన తర్వాత ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. దీంతో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ తర్వాత సభలో ధరల పెంపుపై చర్చ మొదలైంది. లోక్‌సభలో ఏప్రిల్‌లో ఆమోద ముద్ర పడిన 'ఆయుధాల సామూహిక విధ్వంసం, వాటి సరఫరా వ్యవస్థ' సవరణ బిల్లు 2022ను రాజ్యసభ ఆమోదించింది. ధరల పెరుగుదల, ఈడీ దుర్వినియోగం, అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తుండగానే ఈ బిల్లుకు ఆమోదముద్ర లభించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)