100కు 151 మార్కులు ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 August 2022

100కు 151 మార్కులు ?


బీహార్ లోని దుర్భంగా జిల్లా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం (ఎల్‌ఎన్‌ఎంయు) అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి ఓ పేపర్‌లో 100కి 151 వచ్చాయి. మార్కుల లిస్ట్ చూసుకున్న విద్యార్థి ఒక్కసారిగా కంగుతిన్నాడు. యూవర్సిటీలో పార్ట్-2 పరీక్షలో బీఏ విద్యార్థి తన పొలిటికల్ సైన్స్ పేపర్-4లో 151 మార్కులు సాధించినట్లు ఆదివారం తెలిపాడు. అయితే ఆ “ఫలితాలు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు. ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దాన్ని తనిఖీ చేసి ఉండాలని అతను చెప్పాడు. బికామ్ పార్ట్-2 పరీక్షలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పేపర్-4లో సున్నా సాధించిన మరో విద్యార్థి తదుపరి తరగతికి పదోన్నతి పొందాడు. అయితే ఇలా 100కు 151 మార్కులు రావటానికి కారణం టైపింగ్ లోపమేనని విశ్వవిద్యాలయం అధ్యాపకులు పేర్కొన్నారు. ఆ మార్కులను సవరించి మళ్లీ కొత్త మార్కుల షీట్ ను జారీ చేసినట్లు విద్యార్థి తెలిపాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రెండు మార్క్‌షీట్‌లలో టైపింగ్ తప్పులు ఉన్నాయని చెప్పారు. “టైపోగ్రాఫికల్ లోపాలను సరిదిద్దిన తరువాత, ఇద్దరు విద్యార్థులకు తాజాగా మార్కుల షీట్లు జారీ చేయడం జరిగిందని, అవి కేవలం టైపోగ్రాఫికల్ తప్పులేనని చెప్పారు.

No comments:

Post a Comment