లక్ష మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్

Telugu Lo Computer
0


అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ తమ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లలోని ఉద్యోగులను భారీగా తొలగించింది. కంపెనీలు తమ హైరింగ్‌ ప్లాన్స్‌ను ఇంకోసారి పరిశీలించుకోవాలని, తాము కూడా కిందటేడాదితో పోలిస్తే ఈ సారి ఉద్యోగులను తీసుకోవడం తగ్గించేశామని అమెజాన్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ బ్రియాన్‌ ఓల్సవిస్కీ అన్నారు. కిందటేడాది నికరంగా 27 వేల మందిని ఉద్యోగులను తొలగించామని, ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌లో 14 వేల మందిని నియమించుకున్నామని ఆయన అన్నారు. టెక్ కంపెనీ గూగుల్‌ కూడా నియామకాలను తగ్గించేసింది. ఈ కంపెనీ మొత్తం ఉద్యోగులు ఈ ఏడాది మార్చి నాటికి 1.64 లక్షలుగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఇండియన్ స్టార్టప్‌లు ఈ ఏడాది15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)