మంకీపాక్స్ తో కేరళవాసి మృతి

Telugu Lo Computer
0


కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చవక్కడ్ కురంజియుర్ మంకీపాక్స్ లక్షణాలతో మృతి చెందాడు. ఈయనకు  విదేశాల్లోనే పాజిటివ్ వచ్చింది. “విదేశాలలో నిర్వహించిన పరీక్షల్లో మంకీపాక్స్ పాజిటివ్ అని వచ్చింది. తీవ్రమైన అలసట, మెదడువాపు కారణంగా త్రిస్సూర్‌లో చికిత్స పొందాడు. మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదు” అని మంత్రి వీనా జార్జ్ చెప్పారు. ట్రీట్మెంట్ ఏ దశలో తీసుకున్నాడనే దానిపై విచారణ జరుపుతామని, వైరస్ తీవ్రతతోనే మృతి చెందాడా, అప్పటికీ సమస్యతో బాధపడుతూనే ఉన్నాడా అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్లు జార్జ్ తెలిపారు. ఈ మృతిపై పున్నయుర్ లో మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇంతలో చనిపోయిన వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్, రూట్ మ్యాప్ లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ అయిన వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ దేశంలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మూడు కేరళలో ఫైల్ అవగా, ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒకటి. దీంతో ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలోని రాష్ట్రాలన్నీ అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. నీతి అయోగ్ సభ్యులు డా. వీకే పాల్ మాట్లాడుతూ కంగారుపడనవసరం లేదని, లక్షణాలున్న వ్యక్తులు కచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. 78దేశాల్లో ఇప్పటివరకూ 18వేల కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)