తేనెటీగ కుడితే ?

Telugu Lo Computer
0


తేనెటీగలు కుడితే కళ్ల ముందే ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. తేనెటీగల జోలికి వెళితే పరిగెత్తిస్తాయి. కసిగా అందిన దగ్గర కుట్టేస్తాయి. ఆ మంటను భరించడం ఎంతో కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు దాని విషం ప్రాణాంతకంగా మారుతుంది. చాలా మంది మంటను భరించలేక చల్లని నీటిని పోయడంగానీ ఐస్‌ముక్కలను గానీ పెడుతారు. మరికొంతమంది ఆకు పసర్లను పట్టిస్తారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తేనెటీగలు కుట్టినపుడు ఆందోళనకు గురికాకూడదు. అది కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. ఐస్‌ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్టు అద్దాలి. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇలా చేస్తే బాధ, నొప్పి తగ్గుతుంది. కుట్టిన చోట పదే పదే కదపొద్దు. కాటు వేసిన ప్రాంతాన్ని మంచి బట్టతో కట్టు కట్టాలి. అది రక్త సరఫరాను అడ్డుకునేలా ఉండొద్దు. పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)