సామాన్యుడి వంటింట మంట ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 July 2022

సామాన్యుడి వంటింట మంట !


జీఎస్‌టీ మండలి సమావేశమై పన్ను రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల కమిటీ చర్చించింది. కొన్ని వస్తువులపై పన్ను పెంచగా మరికొన్నింటిపై తగ్గించింది. ఇందులో సామాన్యుడిపై భారం పెరిగే ఉత్పత్తులూ ఉండటం కలవర పెడుతోంది. జులై 18 నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి. పన్నుల వల్ల సామాన్యుడి వంటింటి ఖర్చు మరికొంత పెరగనుంది. ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీర్‌, ముందుగానే ప్యాక్‌ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై 5 శాతం జీఎస్‌టీ వడ్డించారు. ఫలితంగా నిత్యావసర సరకుల ధరలు పెరగనున్నాయి. ప్యాకేజ్‌ చేసిన ఆహారం: ముందుగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న మంత్రుల కమిటీ ప్రతిపాదనను జీఎస్‌టీ మండలి ఆమోదించింది. ఇప్పటి వరకు బ్రాండెడ్‌ కాని ఆహార పదార్థాలపై పన్ను ఉండేది కాదు. అందులోంచి ప్రీ ప్యాకేజ్‌డ్‌, ప్రీ లేబుల్డ్‌ రిటైల్‌ ప్యాకెట్లను ఇందులోంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లేబుల్‌, ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీ, బటర్‌ మిల్క్‌పై పన్ను వేస్తారు. బ్యాంకు చెక్‌ బుక్కులు: వినియోగదారులకు కొద్దిగా రుసుము తీసుకొని బ్యాంకులు చెక్‌ బుక్కులు మంజూరు చేస్తాయి. ఆ రుసుముపై ఇక నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించనున్నారు. రోజుకు వెయ్యి రూపాయిలు వసూలు చేసే హోటల్‌ గదులను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు పరిధిలో ఉంది. హాస్పిటల్‌ పడకలు: ఆస్పత్రుల్లో ఒక పడకకు రోజుకు రూ.5000కు మించి బిల్లు వేస్తే దానిపై ఐటీసీతో సంబంధం లేకుండా 5 శాతం పన్ను వేస్తారు. ఐసీయూ పడకలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎల్‌ఈడీ బుగ్గలు: త్వరలో ఎల్‌ఈడీ బుగ్గలు, ఫిక్చర్లు, ఎల్‌ఈడీ దీపాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్నును 18 శాతానికి పెంచారు. కత్తులు: కట్టింగ్‌ బ్లేడ్స్‌, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కే షార్ప్‌నర్లు, బ్లేడులు, చెంచాలు, ఫోర్కులు, లాడ్లీలు, స్కిమ్మర్లు, కేక్‌ సర్వ్‌ చేసే పాత్రలను 12 శాతం నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. పంపులు, యంత్రాలు: నీటి పంపులు, సెంట్రీఫ్యూజల్‌ పంపులు, బావుల్లో వాడే టర్బైన్‌ పంపులు, సబ్‌మెర్సిబుల్‌ పంపులు, సైకిల్‌ పంపులను 12 నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. శుభ్రం చేసే యంత్రాలు, గార్డెనింగ్‌ యంత్రాలు, విత్తనాలు నాటే యంత్రాలు, వాయు ఆధారిత పిండి చక్కీ, వెట్‌ గ్రైండర్లపై 12 కాకుండా 18 శాతం పన్ను విధిస్తారు.

No comments:

Post a Comment