వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న అడ్మిన్ అరెస్టు

Telugu Lo Computer
0


దేశానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న పాట్నాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బిహార్, పాట్నాలోని ఫుల్వారి షరీఫ్‌కు చెందిన మార్గువ్ అహ్మద్ డ్యానిష్ అలియాస్ తాహిర్ అనే 26 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా యాంటీ ఇండియా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నాడు. ఈ గ్రూప్ పేరు 'ఘాజ్వా-ఇ-హింద్'. దీని ద్వారా భారత వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ గ్రూపులో భారతీయులతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో మన జాతీయ పతాకం, జాతీయ చిహ్నానికి వ్యతిరేకంగా పలు పోస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గరి నుంచి పోలీసులు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తాహిర్‌కు పాకిస్తాన్‌కు చెందిన తెహ్రీక్-ఇ-లాబ్బైక్ అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి. విదేశాలకు చెందిన పలు గ్రూపులతో కూడా తాహిర్ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇటీవల పోలీసులు మోదీ హత్యకు కుట్ర పన్నిన ఇద్దరు తీవ్రవాదుల్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి వద్ద లభించిన సమాచారం ఆధారంగా ఇతర ప్రదేశాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తీవ్రవాదులతో సంబంధాలు కలిగిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు తాజాగా భారత వ్యతిరేక వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న అడ్మిన్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు విచారిస్తారు. ఈ విచారణలో ఈడీ కూడా పాల్గొంటుందని పోలీసులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)