భూతల నరకం గిటారమా జైలు !

Telugu Lo Computer
0


ఆఫ్రికా ఖండంలోని రువాండా  దేశం లో గిటారమా అనే జైలు ఉంది. ఈ భూమిపై నరకానికి మారు  ప్రదేశంగా దీనిని భావిస్తారు. ఈ జైలును రువాండా రాజధాని కిగాలీలో 1960ల్లో నిర్మించారు. మొదట బ్రిటిష్ కార్మికులు నివసించడానికి దీనిని కట్టారు. ఆ తర్వాత జైలుగా మార్చారు. గిటారమా జైలు సామర్థ్యం 400 మంది ఖైదీలు. కానీ ప్రస్తుతం ఏడు వేల మందికి పైగా ఖైదీలు ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 1990లో రువాండా మారణహోమం జరిగినప్పుడు దాదాపు 50,000 మంది ఖైదీలను ఇక్కడ బంధించారు. ఈ జైలులో ఖైదీలను మనుషుల్లా కాదు కదా.. కనీసం జంతువుల్లా కూడా చూడరు. ఖైదీలు కూర్చోవడానికి కూడా ఇక్కడ స్థలం ఉండదు. చాలా మంది ఖైదీలను టాయిలెట్లలో ఉంచారు. ఇక్కుడున్న ఖైదీల్లో కొందరు నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తుంటే, మరికొందరు మాత్రం అమాయకులు. ఏ తప్పు చేయకుండానే జైల్లో మగ్గుతున్నారు. తప్పుడు కేసుల వల్ల నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా అంగీకరిస్తారు. రెడ్‌క్రాస్ నివేదిక ప్రకారం గిటారమ జైల్లో  సరిపడా తిండి లేక  ప్రతి రోజూ ఆరుగురు ఖైదీలు మరణిస్తున్నారు. ఎప్పుడైనా అన్నం పెడితే.. దాని కోసం వారిలో వారు కొట్టుకుంటారు. చంపుకుంటారు. వారి గురించి అధికారులు ఫిర్యాదు చేశారో.. అంతే సంగతులు. ఆ మరుసటి క్షణమే అతడు శవమై కనిపిస్తాడు. మరో దారుణమైన విషయం ఏంటంటే ఆకలికి తట్టుకోలేక కొందరు చనిపోయిన ఖైదీల మాంసాన్ని తింటారు. ఒక్కోసారి బతికున్న వారి చర్మాన్ని కోసి కూడా తింటారు. గిటారమ జైల్లో ఇంత ఘోరం జరుగుతుందా అని.. మానవ హక్కుల సంఘాలు రువాండా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. . ఖైదీలు చనిపోతే వారి మాంసాన్ని తినకూడదని జైల్లో నిషేధం విధించారు. అయినప్పటికీ అక్కడి పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ ఖైదీలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఆకలితో అలమటించి ఎంతో మంది ఖైదీలు చనిపోతున్నారు. అందుకే ఈ భూమిపై ఉన్న నరకంగా గిటారమ జైలుకు పేరుంది

Post a Comment

0Comments

Post a Comment (0)