భారత డిగ్రీతో యూకేలోఉద్యోగం !

Telugu Lo Computer
0


భారత ప్రభుత్వం చొరవతో యూకేలో మన విద్యార్థులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండు దేశాల్లోని డిగ్రీలను సమానమైనవిగా గుర్తించడానికి గురువారం బ్రిటన్, భారత్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఇకపై విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఒప్పందం అపరిమితమైన అవకాశాలను కల్పించనుంది. వారి విద్యకు అనుగుణంగా యూకేలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందటం ఇకపై సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు ఉన్నత చదువులు అభ్యసిస్తున్న లేదా యూకేలో ఉద్యోగం కోరుకునేవారు యూకే డిగ్రీ హోల్డర్‌లతో సమానంగా ఉంటారు. అంటే..రెండు దేశాలు ఇప్పుడు ఒకరి విద్యా సంస్థల నుంచి కొన్ని బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులను పరస్పరం సమానమైనవిగా గుర్తిస్తాయి. ఇండియన్ సీనియర్ సెకండరీ స్కూల్ /ప్రీ-యూనివర్శిటీ సర్టిఫికెట్లు ఇప్పుడు యూకే ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి అర్హత పొందాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీలో ప్రొఫెషనల్ డిగ్రీలు ప్రస్తుతం ఒప్పందం నుంచి మినహాయించబడ్డాయి. అయితే వీటిని కూడా ఒప్పందం పరిధిలోకి చేర్చేందుకు భారత్ చర్చలు జరుపుతోందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. రెండు దేశాలు జనవరి నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి చర్చలు ముగుస్తాయి. ఈ తాజా ఒప్పందం యూకే కి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భారత ఔత్సాహిక అంతర్జాతీయ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉద్యోగుల సరఫరా కొరతను పరిష్కరిస్తుంది. యూకే లో ప్రస్తుతం కొత్త ప్రధాని ఎన్నిక జరగుతున్నందున.. ప్రధాన మంత్రిగా ఎవరు వచ్చినా  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులో ఉంటుందని సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)