తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామ శివార్లలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడికి ఆ చుట్టు పక్కన ప్రదేశాల్ని చూడటానికి వచ్చే ప్రేమ జంటలను రామకృష్ణ సీక్రెట్‌గా తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అందరిలో ఒకడిగా వచ్చి సీక్రెట్‌గా ఇలాంటి పనులకు పాల్పడటంతో మిగిలిన పర్యాటకులు కూడా భయపడిపోయారు. తమ వీడియోలు కూడా ఏవైనా అభ్యంతరకరమైనవి షూట్ చేశాడా అని కాసేపు కంగారుపడ్డారు. గత కొద్దిరోజులుగా ఇదే విధంగా యువతి, యువకులకు తెలియకుండా వీడియోలు తీస్తున్న రామకృష్ణను గురువారం ఓ ప్రేమజంట పసిగట్టి పట్టుకుంది. అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని చూసి షాక్ అయ్యారు. రామకృష్ణ ఫోన్లో సుమారు 40 జంటల వీడియోలు ఉండటంతో స్థానికులకు చెప్పి చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు రామకృష్ణ ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఫోన్లో ఉన్న వీడియోలేనా గతంలో ఇంకా ఎవైనా చిత్రీకరించాడా లేక తన ఫోన్లో ఉన్న వీడియోలు ఎవరెవరికి పంపాడు, ఏ గ్రూప్‌లో షేర్ చేశాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. పట్టుబడిన రామకృష్ణ మానసిక స్థితిని పోలీసులు పరిశీలించారు. ఎందుకిలా చేస్తున్నాడు. డబ్బుల కోసం ప్రేమ జంటల్ని బ్లాక్ మెయిల్ చేయడానికా లేక సైకో లక్షణాల కారణంగా ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటున్నారు. అతను మాట్లాడే విధానం, నడవడిక చూస్తుంటే బాగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
రహస్యంగా ప్రేమ జంటల ఫోటోలు తీసే తుంటరి !
July 23, 2022
0