హీరోలు మన మధ్యే ఉంటారు !

Telugu Lo Computer
0

 

చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌, టోంగ్‌సియాంగ్‌లో షెన్‌ డాంగ్‌ అనే వ్యక్తి తన కారును రోడ్డు పక్కన పార్క్‌ చేస్తుండగా పెద్ద శబ్ధం వినిపించింది. ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లోని అయిదో అంతస్తు కిటికీలోంచి అదుపుతప్పి రెండేళ్ల చిన్నారి కిందకు పడటం గమనించాడు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా పాప ఒక స్టీల్‌ రూఫ్‌ మీద పడింది. అక్కడి నుంచి క్షణాల్లోనే కిందకు జారింది. అప్రమత్తమైన వ్యక్తి వెంటనే బిల్డింగ్‌ వద్దకు పరుగెత్తి కింద పడుతున్న పాపను కాపాడాడు. హీరోలు మన మధ్యే ఉంటారనే క్యాప్షన్‌తో చైనా ప్రభుత్వ అధికారి లిజియాన్‌ జావో ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్న ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 68 వేల మంది వీక్షించారు. ఈ వీడియో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. చిన్నారిని రక్షించిన వ్యక్తి ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. 'నిజమైన హీరోలు ప్రపంచంలోనే ఉన్నారు. సినిమాల్లో కాదు. సూపర్‌ హీరో.. లెజెండ్‌.. అతనికి ప్రమోషన్‌ లేదా మెడల్‌ ఇవ్వండి' అని కామెంట్‌ చేస్తున్నారు. ప్రమాదంలో చిన్నారి కాళ్లు, ఊపిరిత్తితులకు గాయాలు అయినట్లు, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై డాంగ్‌ మాట్లాడుతూ.. రోడ్డు పక్కన కారు పార్క్‌చేస్తుండగా పాప పడిపోవడం గమనించి వెంటనే పరుగెత్తి ఆమెను రక్షించినట్లు తెలిపారు. తాను సమయానికి అక్కడికి చేరుకొని పాపను కాపాడటం అదృష్టంగా భావిస్తున్నానని, లేదంటే పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)