మంకీపాక్స్‌కు కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 July 2022

మంకీపాక్స్‌కు కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలి !


దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగు చూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్‌ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. మంకీపాక్స్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్స్‌ సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. డబ్ల్యూహెచ్ వో మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంతవరకు 75 దేశాలలో 16 వేల మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. మంకీ పాక్స్ కారణంగా ఇప్పటికి ఐదుగురు మరణించినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది.

No comments:

Post a Comment