అద్భుతమైన సంతకంగా గుర్తించిన యునెస్కో !

Telugu Lo Computer
0


కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య సంతకం చేయడంలో ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన సంతకంగా కూడా గుర్తించింది. కర్ణాటక రాష్ట్రంలోని హోనావర్‌ సబ్ రిజిస్టర్ శాంతయ్య తన సంతకం విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించారు. ఉద్యోగ విధుల్లో భాగంగా ఆయన నిత్యం సంతకాలు పెడుతుండాలి. అయితే తన సంతకాన్ని ఎవరూ కాపీ కొట్టకుండా. చాలా కష్టంగా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. ఆయన పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. ఆయన తన పేరును ఆంగ్లంలో కుదించి సంతకం చేయడం ప్రారంభించారు. అది కూడా చాలా కష్టతరంగా ఉండటంతో ఆయన సంతకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)