విజయవాడలో మంకీ పాక్స్ కేసు ?

Telugu Lo Computer
0


విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. దీంతో అలర్ట్ అయ్యారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో అదీ మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి నమూనాలను సేకరించి పూణె ల్యాబ్‌కు పంపించారు. చిన్నారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచారు. సమాచారాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా సోకే అవకాశం ఉంది. గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా వ్యాపిస్తుందట. మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరు మంకీపాక్స్‌కు గురైన సమయంలో వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుందట. అలాగే మంకీ పాక్స్ వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చలి, అలసట ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)