వీఆర్వోకి తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో వరద సాయం అందించేందుకు వెళుతున్న వీఆర్వో గొల్లం మందల లక్ష్మీ కుమారికి ప్రమాదం తప్పింది. మామిడికుదురు మండలం పెదపట్ల లంకలో రెవిన్యూ అండ్ పంచాయతీ సిబ్బంది ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పింది. వరద బాధితులను తరలించేందుకు వీ ఆర్ వో నాటు పడవ ఎక్కారు. వరద నీరు వడిగా ప్రవహించడంతో పడవ తిరగబడి పోయింది. పడవ తిరగబడడంతో వరద నీటిలో మునిగి పోతున్న మహిళా వీఆర్వోని స్థానికులు రక్షించారు. మరోవైపు గోదావరి భారీ వరదల్లో కొట్టుకు వస్తున్న భయంకరమైన విష సర్పాలతో జనం హడలిపోతున్నారు. ఏ సర్పం ఎక్కడినించి బయటకు వస్తుందో తెలీక వరద నీటిలో బిక్కుబిక్కుమంటున్నారు జనం. మామిడికుదురు మండలం, బి.దొడ్డవరం లో వరదలకు కొట్టుకు వచ్చి గోడపైకి ఎక్కిన పాములను చూసి హడలిపోతున్న స్థానికులు ఈ క్షణాన ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా వుంటే.. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో రోడ్డు కం రైలు బ్రిడ్జి పై నుండి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. రాజమండ్రి-కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై భారీ వాహనాలకి అనుమతి నిరాకరించి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం బైక్ లు, ఆటోలు , కార్లకి మాత్రమే బ్రిడ్జి పైకి అనుమతి ఇస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలు నిషేధం అమలు చేయడంతో బ్రిడ్జికి ఇరువైపుల పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)