బెంగాల్‌లో బాంబు పేలి ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ ప్రాంతంలో శనివారం జరిగిన ముడి బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సోఫికుల్ ఇస్లాం (32), ఫజ్రుల్ సేఖ్ ​​(37)గా గుర్తించారు. గాయపడిన ఆలం సేఖ్ ​​(19) మాల్దాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మాల్దా ఎస్పీ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వీరంతా గోపాల్‌పూర్‌ గ్రామంలోని మామిడి తోటలో అక్రమంగా బాంబుల తయారీ చేపట్టారని వెల్లడించారు. పొలంలో బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని వారు తెలిపారు. విచారణ నిమిత్తం పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో ముడి బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని ముడి పదార్థాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాంబులు తయారు చేయడానికి గల కారణాలను కూడా నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో ఉందని, పరిస్థితి అదుపులో ఉందని పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోందని, శుక్రవారం ఆ ప్రాంతం నుంచి నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.భూముల విషయంలో అధికార టీఎంసీలో వర్గపోరు కారణంగా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని స్థానికులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)