శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 July 2022

శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు


ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనార్హం. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో శరద్ పవార్ సమర్పించిన అఫడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ శాఖ నుంచి తనకు నోటీసులు వచ్చాయని శరద్ పవార్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ విమర్శించారు. ఓ వైపు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలటం, వెను వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటం, శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎం కావటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టిస్తున్నారు. దీంట్లో భాగంగానే శరత్ పవార్ కు ఐటీ నోటీజులు రావటం. ఊహించని రీతిలో సీఎం ఉద్దవ్ హాయంలో తీసుకున్న నిర్ణయాలపై కొత్త సీఎం షిండే దృష్టి పెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. షిండే సీఎం అయిన 24గంటలు పూర్తికాకముందే ట్రబుల్ షూటర్ గా పేరొందని పవార్ కే నోటీసులతో షాక్ ఇచ్చింది ఐటీ శాఖ. ఐటీ శాఖ తనకు నోటీసులు పంపింటంపై శరత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ నుంచి తనకు నోటీసులు రావటం ఆందోళనగా లేదని తాను ఊహించిదేనని పవారు తెలిపారు.

No comments:

Post a Comment