పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 July 2022

పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం


ఒడిషాలోని పూరి లో జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా రథయాత్ర నిర్వహించలేదు. ఈ ఏడాది రథయాత్ర నిర్వహిస్తూ ఉండటంతో పూరి పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పూరీ నగరం లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈ సారి యాత్రకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచానా వేశారు. వీరికోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్ధం తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, సమీప రాష్ట్రాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు. ఆనవాయితీ ప్రకారం జగన్నాధుడి సోదరుడు బలభద్రుడు సోదరి సుభ్రద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు నందిఘోష్(జగన్నాథుడి రథం) తాళధ్వజ (బలభద్రుడిది) దర్పదళన్ (సుభద్ర) రథాలు సిధ్దమయ్యాయి. పూరిలో ఐదంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. రథయాత్రలో తొక్కిస లాట లేకుండా బందోబస్తు చేసామని జీజీపీ సునీల్ బన్సల్ తెలిపారు. రథయాత్ర జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంతాన్ని ఈరోజు నోఫ్లయింగ్ జోన్ గా చేయాలని విమానశ్రయం అధికారులను కోరామని డీజీపీ తెలిపారు. సనాతన ధర్మంలో ఈ రథయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే రథయాత్రలో పాల్గొంటారో, వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షస్థానానికి వెళతారని భక్తులు నమ్ముతారు.

No comments:

Post a Comment