ఆషాడంలో మునగాకు కూర ఎందుకు తినాలి ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

ఆషాడంలో మునగాకు కూర ఎందుకు తినాలి ?


మునగాకు కూర, నేరేడు పండ్లు తాటికాయలు ఇవన్నీ ఆషాడానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అయితే ఆషాడ లో మునగాకు తినాలి అంటారు. మునగాకు తినే సంప్రదాయం ఇప్పటి కాదు.  అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి.. మిగిలిన నెలల్లో తినకూడదా అనే ఆధునిక భావాలున్నవారు కూడా ఉన్నారు.. అయితే ఇలా ఆషాడంలో మునగాకు తినాలి అని పెద్దలు పెట్టిన సాంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంది. మునగాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మునగాకు వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకని వేసవిలో ఈ మునగాకు తినడం వలన విపరీతమైన వేడి చేసి ఇతర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక మునగాకు తినడానికి అనుకూల సమయం.. వర్షాలు కురిసే ఆషాడం. ఆషాడంలో లేత మునగాకు దొరుకుతుంది.. తిన్నా శరీరంలో వేడి పెరిగినా వర్షాకాలం కనుక పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచుతుంది. మునగాకులోని పోషకాలు శరీరానికి అందుతాయి. మునగాకు తినడం వలన దీనిలో అధికంగా ఉన్న విటమిన్ ఏ.. కంటి సమస్యలను నివారిస్తాయని.. ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. మునగాకు తినడం వలన ప్రొటీన్లు, విటమిన్‌ ఎ, సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియం మనకి లభిస్తాయి. మునగాకుని ఏ రూపంలో తిన్నా మధుమేహం నియంత్రణలో ఉంచుతుంది. అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను కూడా నివారిస్తుంది. అంతేకాదు మునగాకు బాలింతలకు, గర్భిణులకు ఎంతో మంచిది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ మునగాకుని డైరెక్ట్ గా తినలేము.. ఎందుకంటే కొంచెం చేదు రుచి కలిగి ఉంటుంది. కనుక మునగాకు పెసర పప్పు, అనపప్పు పప్పులో వేసుకుని వండుకుంటారు. లేదంటే. తెలగపిండి మునగాకు కూరగా చేసుకుని తింటారు.. గోదావరి జిలాల్లో ఆషాడం ఆదివారం వస్తే.. ప్రతి ఇంట్లో.. మునగాకు పప్పు, లేదా తెలగపిండి మునగాకు కూర చేసుకుంటారు. ఇక గోరింటాకు రుబ్బి.. తమ ఇరుగు పొరుగుకు పంచిపెడతారు.. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటించే కుటుంబాలు అనేకం ఉన్నాయి.

No comments:

Post a Comment