జీఎస్టీపై 'పన్నీర్, బటర్, మసాలా' జోక్ వైరల్

Telugu Lo Computer
0


ఆహార పదార్థాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు తెగ నచ్చేసింది. దాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వాట్సాప్ జోక్‌ను ఎవరు పంపారో తెలియదు కానీ, జీఎస్టీపై వస్తోన్న అత్యద్భుత జోకుల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని ఆయన అన్నారు. 'పన్నీర్‌పై జీఎస్టీ 5 శాతం, బటర్ (వెన్న)పై 12 శాతం, మసాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గణితశాస్త్ర ప్రశ్న వచ్చింది. పన్నీర్ బటర్‌ మసాలాపై జీఎస్టీ ఎంత?' అంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఈ జోక్ వాట్సాప్‌లోనే కాకుండా ట్విటర్, ఫేస్ బుక్ లో బాగా వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో శశి థరూర్ చురుకుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై వాటి ద్వారా విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. ప్యాక్‌ లేదా లేబుల్‌ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిస్తారు. అలాగే, చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఫీజుపై కూడా జీఎస్టీ అమలవుతుంది. ప్యాక్ చేసిన, లేబుల్డ్‌ ఆహార ఉత్పత్తులకు పన్ను మినహాయింపులను తొలగించాలని ఇటీవల కేంద్ర సర్కారు నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)