కెనడాలో గాంధీ విగ్రహానికి అవమానం

Telugu Lo Computer
0


జాతిపిత మహాత్మా గాంధీకి కెనడాలో అవమానం జరిగింది. కొంతమంది దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా.. అసభ్యరీతిలో రాతలు రాశారు. ఈ ఘటనను కెనడాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. విద్వేశపూరిత నేరం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెనడా ఒంటారియోలోని రిచ్మండ్ హిల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యోగంగే స్ట్రీల్, గార్డెన్ అమెన్యూ ప్రాంతంలోని విష్ణు మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనలపై భారత హై కమిషన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. '' రిచ్మండ్ హిల్ లోని విష్ణుదేవాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మేము బాధపడ్డాము. ఈ నేరం, విధ్వంసక చర్య కెనడాలోని భారతీయ సమాజ మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ విద్వేశపూరిత నేరాన్ని పరిశోధించడానికి కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము'' అంటూ టొరంటోలోని భారత కాన్సులేట్ ట్వీట్ చేసింది. భారత సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఈ విద్వేశపూరిత నేరం పట్ల మేము తీవ్ర వేదన చెందామని.. ఇక్కడి భారతీయ సమాజం ఆందోళన, అభద్రతాభావానికి దారి తీసింది అని.. దర్యాప్తు చేసి, నేరస్తులను త్వరిగతిన న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని కెనడా ప్రభుత్వాన్ని కోరామని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారు. విద్వేశపూరిత సంఘటనగా దీన్ని అభివర్ణించారు. రేపిస్ట్.. ఖలిస్తాన్ అనే పదాలను విగ్రహం వద్ద దుండగులు రాశారు. విద్వేషపూరిత నేరాలను సహించమని కెనడా పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)