లింగ విఫక్షతలో 135వ స్థానంలో భారత్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 July 2022

లింగ విఫక్షతలో 135వ స్థానంలో భారత్ !


వరల్డ్ ఎకనామిక్ ఫోరం లింగ సమానత్వ సూచీ 2022లో పొరుగు దేశాల కన్నా వెనకబడి భారత్ ఉంది. మొత్తం 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. మన తర్వాత మరో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక(110), మాల్దీవులు (117), భూటాన్ (126) కన్నా ఇండియా వెనకబడి ఉంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, కాంగో, ఇరాన్‌, చాద్ దేశాలు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. లింగ సమానత్వం సాధించాలంటే 132 ఏళ్లు పడుతుందని పేర్కొంది. దక్షిణాసియా లింగ సమానత్వాన్ని సాధించాలంటే 197 సంవత్సరాలు పడుతుందని..నివేదిక పేర్కొంది. 2021 ఏడాదిలో 156 దేశాల్లో ఇండియా 140వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 4 అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యా సాధన, ఆరోగ్యం- మనుగడ, రాజకీయ సాధికారత అంశాల ఆధారంగా సున్నా నుంచి 100 వరకు స్కోర్ ఇస్తారు. ఆర్థిక భాగస్వామ్య- అవకాశాల్లో 143వ స్థానంలో, విద్యా సాధనలో 107వ స్థానంలో, రాజకీయ సాధికారతలో 48వ స్థానంలో నిలిచింది. ' ఆరోగ్యం- మనుగడ' సూచిలో ఇండియా అట్టడుగున 146వ స్థానంలో నిలిచింది. జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో ఐస్ లాండ్ మొదటిస్థానంలో ఉంది. 90 శాతం కన్నా ఎక్కువ లింగ సమానత్వం ఒక్క ఐస్ లాండే నమోదు చేసింది. తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడర్ దేశాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన రువాండా 6వ స్థానంలో, నమీబియా 8వ స్థానంలో ఉన్నాయి. నికరాగ్వా 7వ స్థానంలో, ఐర్లాండ్ , జర్మనీ 9,10 వ స్థానాల్లో ఉన్నాయి.

No comments:

Post a Comment