వడోదర నగర వీధుల్లో మొసలి !

Telugu Lo Computer
0


గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా వరద నీటిలో ఓ మొసలి వడోదర నగర రహదారిపైకి రావడంతో దాన్ని అటవీశాఖ అధికారులు రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వడోదరలో వరదలు వెల్లువెత్తడంతో మొసళ్లు సంచరించే సంఘటన వెలుగుచూసింది.వడోదరలోని విశ్వామిత్ర నదిలో వందలాది మొసళ్లు ఉన్నాయి.వడోదరలోని పూజా గార్డెన్ ప్రాంతంలో ఓ మొసలి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందారు. వడోదర నగరంలో వరదనీటి ప్రవాహంతో మొసళ్లు వీధులనే శాశ్వత నివాసంగా మార్చుకుంటున్నాయి.గుజరాత్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు నగరాల్లో వరదలు వెల్లువెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్ణ, అంబికా, కావేరీ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జులై 14 న నవ్‌సారిలో అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)