భాగ్యనగరంలో పటిష్ఠ బందోబస్తు !

Telugu Lo Computer
0


జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమాశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు. 3వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో మోదీ పాల్గొంటారు. రేపు హైదరాబాద్ కు చేరుకోనున్న మోదీ, ఎల్లుండి బహిరంగ సభ అనంతరం తిరుగు పయణమవుతారు. మోదీ రాక సందర్భంగా భాగ్యనగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ భద్రత పర్యవేక్షణకు ఎస్పీజీ బలగాలు రంగంలోకి దిగాయి. మోదీ రాక సందర్భంగా నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని చుట్టూ ఎస్పీజీ తోపాటు పటిష్టమైన భద్రత వలయం ఉంటుంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్స్ తో నిరంతర నిఘా ఉంటుంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల పరిధిలోని ప్రాంతాలన్నీ స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీలు నిఘాలో ఉంటాయి. ఇప్పటికే ఎస్పీజీ బృందాలు ప్రధాని పాల్గొనే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. సిటీ పోలీస్ తో ఎస్పీజీ సిబ్బంది భేటీ అయ్యి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ప్రధాని బస చేసే హోటల్ ప్రాంతంలో మెట్రో సేవలు బంద్ చేయనున్నారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా 3వ తేదీ పరేడ్ గ్రౌండ్ సభరోజు పెరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ ను పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. చుట్టు పక్కల బిల్డింగ్స్ ను శనివారం నుండి ఎస్సీజీ తమ ఆధీనంలో తీసుకోనుంది. ప్రధాని హైదరాబాద్ లో అడుగుపెట్టే సమయం నుంచి తిరిగి ఢిల్లీకి పయణమయ్యే వరకు బేగంపేట్ విమానాశ్రయం, హెచ్ఐసిసి నోవెటెల్, పెరేడ్ గ్రౌండ్ చుట్టూ అనుక్షణం పటిష్ఠ భద్రత ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)