దేశంలో 17, 070 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 17, 070 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే అయినప్పటికీ.. పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం, రికవరీలు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో 23 మరణించారు.  యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,07, 189కి చేరింది. 3.40 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో రికవరీల సంఖ్య పెరగకపోవడంపై వైద్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని అంచనా వేస్తున్నారు.  కరోనా యాక్టివ్‌ కేసులు సుమారు 122 రోజుల తర్వాత దేశంలో లక్ష మార్క్‌ను దాటేశాయి. గత రెండు వారాల సగటున 78 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని, మరణాలు కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ విషయంలోనూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తూ వస్తోంది.



Post a Comment

0Comments

Post a Comment (0)