బంగారంపై దిగుమతి సుంకం పెంపు

Telugu Lo Computer
0


బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును 7.5 శాతం నుంచి 12.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ తర్వాత బంగారం డిమాండ్ పెరగడంతో భారత్‌ 10 ఏళ్లలో దిగుమతి చేసుకున్న దాని కంటే గత ఏడాదిలోనే అత్యధికంగా దిగుమతి చేసుకుంది. ఇదిలా ఉండగా బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారులు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో ఈ భారం రిటైల్‌ కొనుగోలు దారులపై పడుతుంది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ప్రక్క దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)