దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయని,  60 మంది ప్రాణాలు కోల్పోయారని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.  హోం క్వారంటైన్లలో, ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనాకు 1,49,482 మంది (0.34 శాతం) చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 21,219 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరిందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉందని తెలిపింది. అలాగే, వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 37,06,997 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య మొత్తం 201.30 కోట్లకు చేరిందని తెలిపింది. వాటిలో 92.85 కోట్ల సెకండ్ డోసులు, 6.63 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో 4,95,359 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. దేశం మొత్తం ఇప్పటివరకు 87.16 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)