బెడ్రూంలో నుంచి వింత శబ్ధాలు.. వెళ్లి చూడగా ...!

Telugu Lo Computer
0


నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్, కుంబ్రియాలోని స్కిన్‌బర్నెస్‌లో గల తమ హాలిడే హోమ్‌లో లిండా గోల్డీ (73), ఆమె భర్త పీటర్( 70) గడుపుతున్నారు. రోజులానే వారి వారి పనుల్లో బిజీగా ఉండగా ఇంట్లో నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి ఇళ్లంతా వెతకడం ప్రారంభించారు. ఆ సౌండ్ బెడ్‌రూమ్‌ నుంచి వస్తున్నట్లు వారు కనుగొన్నారు. స్లోగా ఆ రూమ్‌లోకి ఎంటరయ్యాయి. దిండ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొవ్వొత్తి సెట్ నేలపై పడి ముక్కలు, ముక్కలు అయ్యింది. దీంతో వారు కంగారు పడ్డారు. దొంగ ఏమో అని అలెర్ట్ అయ్యారు. ఇంకొంచెం లోపలికి వెళ్లి చూడగా ఒక నీటి కుక్క బెడ్‌పై పడుకుని ఎంచక్కా గురక పెడుతూ నిద్రపోతుంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఓ వ్యక్తి సహాయంతో దాన్ని బెడ్ రూమ్ నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఆ తర్వాత అది భయపడుతూ అక్కడి నుంచి జారుకుంది. పెట్ గేట్ ద్వారా అది ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని పీటర్ తెలిపారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)