15న 'అగ్నిపథ్'పై సుప్రీంకోర్టులో విచారణ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 July 2022

15న 'అగ్నిపథ్'పై సుప్రీంకోర్టులో విచారణ


కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' స్కీంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారణ జరపనుంది. జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, ఏ.ఎస్.బొపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది. గత జూన్‌లో కేంద్రం 'అగ్నిపథ్' స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు 15 ఏళ్లు సైన్యంలో కొనసాగాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్నిచోట్ల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని కోరింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్ని నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం ఈ పథకంపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే నియామకాల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి యువత నుంచి స్పందన బాగానే ఉందని కేంద్రం చెబుతోంది.

No comments:

Post a Comment