మహారాష్ట్రలో మాస్క్ తప్పనిసరి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 June 2022

మహారాష్ట్రలో మాస్క్ తప్పనిసరి !


మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్ సెక్రటరీ .. జిల్లా అధికారులకు రాసిన లేఖలో ఆదేశించారు. టెస్టింగ్, ట్రాకింగ్ ను వేగవంతం చేయాలని, జిల్లా యంత్రాంగాన్ని సూచించింది. మహారాష్ట్రలో ఇటీవలే బిఎ 4,బిఎ 6 సబ్ వేరియంట్ కేసులు నమోదవ్వడంతో ప్రజలంతాఅప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరింది. మూడు నెలల తరువాత తొలిసారిగా జూన్ 1 న మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. శుక్రవారం 1134 కొత్త కేసులు వెలుగు చూడగా, మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబై లోనే 763 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్ కేసులు మళ్లీ 5 వేలు దాటాయి.

No comments:

Post a Comment