రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ !

Telugu Lo Computer
0


రేవంత్ రెడ్డి ని కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50 ఏళ్ళు పాలించారని.. రైతుబంధు, రైతబీమా వంటి ఆలోచన ఎవరకీ రాలేదని.. ఒక్క కేసీఆర్ మదిలోంచి వచ్చాయని అన్నారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై కొంతమంది బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయని వారు మళ్ళీ వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. 14 ఏండ్లు పోరాటం చేస్తే ఎంతోమంది బలిదానాలు చేస్తే గత్యంతరం లేక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. రూ.200 పింఛన్ రూ.2000అయ్యింది త్వరలో కొత్త పింఛన్లు మేమే ఇస్తామని అన్నారు. ఇంటింటికి నీరు, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయాలు అందిస్తున్న ఘనత మాదే అని కేటీఆర్ అన్నారు. పక్కన ఉన్న రాష్ట్రం బీజేపీ దద్దమ్మ పాలన ఉందని అక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా.? అని ప్రశ్నించారు. మాటల మనుషులు కావాలా చేతల మనుషులు కావాలా,ఐరెన్ లెగ్ కావాలా గోల్డెన్ లెగ్ కావాలా అని ప్రజలను అడిగారు. పెద్దోలను తిడితే పెద్దమనుషులం కామని.. పని చేసి పెద్ద మనుషులం కావాలని అన్నారు. ఒకడేమో కుల పిచ్చితో ఉన్నాడని.. మరొకరు మత పిచ్చితో ఉన్నారు జాగ్రత్త అని అన్నారు. మసీదులు తవ్వాలని ఒకడు అంటున్నాడని..స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు అయింది అయినా వీరు మారరని విమర్శించారు. అప్పర్ తుంగభద్రకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్ట్ కు మోదీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని ప్రశ్నించారు. జన్ ధన్ తెరవండి ధన్ ధన్ డబ్బులు ఇస్తా అన్నాడు, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ నల్లధనం అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పుడు రూ. 400 సిలిండర్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని దద్దమ్మ అన్నారు.. ఇప్పుడు రూ.1000 అయ్యింది ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. సర్పంచులకు రావాల్సిన డబ్బులు రూ.1400కోట్లు కేంద్రం అడ్డుకుంది అవి వచ్చిన తర్వాత అందిస్తాం అని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు నీతి జాతి లేని పార్టీలను బండకేసి కొడుదాం అని పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)