వైసీపీది విచ్ఛిన్నకర రాజకీయం

Telugu Lo Computer
0


జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు. రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం చేసింది. బహుజన సిద్దాంతంపై వైసీపీ దాడి చేస్తోంది. తెలంగాణలో కులభావన లేదు.. రాష్ట్ర భావన ఉంది.. కానీ ఏపీలో కుల భావనే ఉంది తప్ప.. ఏపీ అనే భావన కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తి ఏసీబీని కంట్రోల్ చేస్తారట! చాలా హస్యాస్పదంగా ఉంది. వాళ్ల నాన్న సీఎంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్నారు.. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.కాపులను,శెట్టిబలిజలనే తప్పు చేసిన వాళ్లుగా చూస్తున్నారు. శెట్టి బలిజలను దారుణంగా విమర్శిస్తున్నారు. ఇవన్నీ వైసీపీ కావాలనే చేస్తోంది.వైసీపీలోని రెండు వర్గాల మధ్య గొడవే.. కొనసీమలో చిచ్చుకు కారణం.క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగులబడుతుందా..?జనసేనను ఎలా తప్పు పడతారు..?వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినందుకు నిరసన తెలుపుతామంటే 144 సెక్షన్ పెట్టారే.. ఇంత పెద్ద గొడవకు జాగ్రత్త పడరా..? కోనసీమ ఎపిసోడ్ వల్ల జనసేనకు ఏదో నష్టం జరుగుతుందని వైసీపీ భావిస్తే.. అది తెలివి తక్కువ తనమే అవుతుంది.నేను కులాలను కలిపే వాడినే కానీ.. విభజన చేసే వాడిని కాను.యువజనులకు ఉద్యోగాల్లేవ్, కార్మికులకు ఉపాధి లేదు.. రైతులకు గిట్టుబాటు లేదు.. ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అంటే నాకు గౌరవం. వైసీపీ కొన్ని కులాలను వర్గ శత్రువుగా ప్రకటించుకుంటోంది. గతంలో కమ్మవాళ్లని వర్గ శత్రువుగా ప్రకటించినప్పుడే నేను తప్పు పట్టాను. ఓటేయని ప్రతి కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించే సంస్కృతిని తెచ్చింది వైసీపీ. ఇప్పుడు కమ్మొళ్లనే కాకుండా శెట్టిబలిజలు సహా కాపు, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలను వైసీపీ తన వర్గ శత్రువులుగా ప్రకటించింది. కమ్మొళ్లని తిట్టాల్సిందంతా తిట్టేసి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చాలా..? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ మరిచిపోతే మంచిది. అర్ధం కాకుండా మాట్లాడ్డం బొత్సకు అలవాటు. ఎన్ని విమర్శలు చేసినా చేసుకోండి.. కానీ ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లేలా ప్రస్తావన తేవద్దు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదయోగ్యమే కానీ.. ఆడబిడ్డల మాన మర్యాదలకు భంగం వాటిల్లింప చేయడం మాత్రం ఆమోదం కాదు. అంబేద్కర్ పేరు మాకు ఆమోదమే.. కానీ ఏకాభిప్రాయానికి రావాల్సింది కోనసీమ ప్రజలే. ఏకాభిప్రాయానికి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శాంతి కమిటీలు వేసుకోవాలి.. దీనికి జనసేన చొరవ తీసుకోవాలి. జనసేన-బీజేపీకి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ కరోనా కారణంగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. త్వరలోనే జనసేన-బీజేపీ మధ్య సోషల్ డిస్టెన్స్ తగ్గుతుంది.ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చలు కూడా జరిపామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)