రామ్‌గోపాల్‌ వర్మపై ఫిర్యాదు

Telugu Lo Computer
0


భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటిమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముపై రామ్‌గోపాల్‌ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒడిశా లోని కోరాపూట్ జిల్లా నబరంగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా బీజేపీ మహిళా విభాగం సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు. దేశ అత్యున్నత పదవికి పోటీ చేస్తున్న ఒడియా గిరిజన మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు అత్యంత నేర పూరితమైనవిగా అభివర్ణించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా వర్మకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)