స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Telugu Lo Computer
0


స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగాయి. ఒడిదొడుకులకు గురైనప్పటికీ వరుసగా నాలుగోరోజు లాభాలను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను నష్టాలతో మొదలు పెట్టిన సూచీలు చాలా సేపు ఊగిసలాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 53,177కు చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 15,850 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టంతో 52,846.26 వద్ద మొదలైంది. మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, , టాటా స్టీల్, టెక్ మహీంద్రా, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు రాణించగా టైటాన్ , ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, దివిస్‌ ల్యాబ్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు రూపాయి విలువ క్షీణిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ 44 పైసలు పతనమై 78.81 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)