కేసీఆర్ ప్లాన్ ప్రకారమే రాహుల్ గాంధీ మీటింగ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 8 May 2022

కేసీఆర్ ప్లాన్ ప్రకారమే రాహుల్ గాంధీ మీటింగ్


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఎప్పుడో ఖాయమైంది. కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో దారి మళ్లించేందుకు ప్రగతి భవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రాహుల్ గాంధీ చదువుతున్నాడని, కేసీఆర్ ప్లాన్ ప్రకారమే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టాడని, ఆ స్క్రిప్ట్ ప్రకారమే టీఆర్ఎస్ తో పొత్తు లేదని రాహుల్ గాంధీ చెబుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.  గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ దేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు హోల్ సేల్ గా టీఆర్ఎస్ లోకి పోయారని ఎద్దేవ చేశారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్'ఎంసీ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. బీజేపీ ని ఎదుర్కోలేకనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీని సంకలో వేసుకున్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో ఉర్ధూను ప్రవేశపెట్టడం ద్వారా హిందూ యువకులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ ద్వారా ఎంపికైన నియామకాలన్నీ రద్దు చేసి తీరుతామని బండి సంజయ్ అన్నారు. మన జాతి కుడి నుంచి, ఎడమకు రాసే జాతి. ఉల్టా రాసే జాతి కాదు. వచ్చేది బీజేపీ ప్రభుత్వ మే. ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళను వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment