24/7 మద్యాన్ని విక్రయించేందుకు అనుమతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 8 May 2022

24/7 మద్యాన్ని విక్రయించేందుకు అనుమతి


హర్యానా ప్రభుత్వం మందు బాబులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 24 గంటలపాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీని తొలిదఫాలో జూన్‌ 12 నుంచి గురుగ్రామ్‌లో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏడాది కాలానికి గాను రిటైల్‌ లిక్కర్‌ లైసెన్స్‌ ఫీజుకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లించిన బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మద్యంపై ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సర్కార్‌ కీలక నిర‍్ణయం తీసుకుంది. బార్లు, రెస్టారెంట్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యాన్ని అమ్మడానికి అనుమతినిస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్‌ పాలసీ 2021-22 ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే అవకాశమున్నదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప‍్రభుత్వ నిర‍్ణయాలతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాన్ని బార్లు, రెస్టారెంట్ల యజమానులు స్వాగతించడం గమనార్హం.

No comments:

Post a Comment