తాజ్ మహల్ 20 గదులను తెరవాలి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజ్ మహల్ విషయంలో చాలా కాలం నుంచి వివాదం ఉందని డాక్టర్ రజనీశ్ చెప్పారు. ఈ కట్టడంలోని 20 గదులకు తాళాలు వేశారని, వీటిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదని చెప్పారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయనే నమ్మకం ఉందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గదులను తెరవాలని ర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఆదేశించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు. తాజ్ మహల్ మొదట్లో తేజో మహాలయ అనే హిందూ దేవాలయం అని కొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)