మధుమేహం - లక్షణాలు

Telugu Lo Computer
0


మధుమేహం వ్యాధి లక్షణాలు బాడీలో సైలెంట్ గా  కనిపిస్తాయి. కానీ వాటిని ఎవరూ ముందే గ్రహించలేకపోతున్నారు. ఒకరోజుషుగర్ విపరీతంగా ఎక్కువ అవడం లేదా తక్కువ అవడం జరిగి కళ్లు తిరిగి కిందపడటమో, నీరసం రావడమో అవుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే టెస్ట్ చేసి.. షుగర్ వచ్చింది అంటారు. ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటే రక్తంలో సాధారణ చక్కెర స్థాయి కంటే ఎక్కువగా ఉందని అర్థం. దీనిని నిర్లక్ష్యం చేస్తే టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడతయారు. అయితే ఈ ప్రీడయాబెటిస్ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. అమెరికాలో 20 ఏళ్లు పైబడిన 84 మిలియన్ల మందికి ప్రీడయాబెటిస్ ఉంది. కానీ 90% మందికి కూడా అది ఉందన్న విషయం తెలియదు. ప్రీ డయాబెటిస్ ఉన్నట్లయితే గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలకు దీర్ఘకాలిక నష్టం ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చు. ప్రీ డయాబెటీస్‌ వస్తే నోరు ఆరిపోతుంది. నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. ఎండిపోయినట్లు అనిపిస్తుంది. అయితే డయాబెటీస్ కు దీనికి ఏంటి సంబంధం అని నిపుణులు చెప్పడం లేదు కానీ ఇది కూడా ఒక లక్షణంగా చేర్చారు. ప్రీ డయాబెటస్ వ్యక్తులలో చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడుతాయట !. చర్మంపై ముడతలు, మందపాటి పాచెస్ కూడా చూడవచ్చు. ఎక్కువగా ఈ పరిస్థితి మోకాలు వెనుక, పిడికిలి, మోచేతుల లోపల, మెడ మీద కనిపిస్తాయి. నిద్రలేమి సమస్య ఇప్పుడు అందరిలో ఉంటుంది. దీనివల్ల కూడా ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం.. రోజూ ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులలో ప్రీడయాబెటస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ, నిద్ర బలహీనత మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా ఇది ఏర్పడుతుంది. ఒక సగటు వ్యక్తి సాధారణంగా రోజుకు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అయితే మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు చాలా ఎక్కువగా వెళుతారు. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల మీకు విపరీతంగా దాహం వేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)