ఫేక్ రుణ యాప్స్ ని నమ్మి మోసపోవద్దు : ఆర్బీఐ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 5 May 2022

ఫేక్ రుణ యాప్స్ ని నమ్మి మోసపోవద్దు : ఆర్బీఐ


గతకొన్ని నెలలుగా సోషల్ మీడియాలో కొన్ని యాప్‌లు 'మీకూ లోన్ కావాలా, అయితే మమ్మల్ని సంప్రదించండి' అంటూ యాడ్స్ మీద యాడ్స్ ఇస్తున్నాయి. అలా ఆల్‌లైన్‌లో లోన్ల పేరుతో దేశ వ్యాప్తంగా 600 యాప్‌లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఆ 600 యాప్‌ల్లో దాదాపు సగం యాప్‌లు ఫేక్ యాప్స్ అని, వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దు అని ఆర్బీఐ కోరింది. 'ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ రుణ యాప్‌లు అడగకుండానే లోన్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత అడ్డగోలు వడ్డీల దోపిడీతో వంచన చేస్తున్నాయి. కిస్తీ కట్టడం ఏ మాత్రం ఆలస్యమైన మానసిక వేధింపులకు దిగుతున్నాయి. మన ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, ఇతర వివరాలు చోరీచేసి మనకు తెలిసిన వాళ్లకు తప్పుడు సందేశాలు పంపుతూ, మానసికంగా హింసిస్తున్నాయి' అని ఆర్బీఐ తెలిపింది. 600 వరకు లోన్‌ యాప్‌లు ఉన్నట్లు ఆర్బీఐ అధికారులు గుర్తించారు. అందులో ప్రాథమికంగా 137 యాప్‌ల లిస్ట్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ యాప్‌ల పట్ల ప్రజలు, చిరు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 'యూపీఏ లోన్‌, గోల్డ్‌మ్యాన్‌ పే బ్యాక్‌, హ్యాండీ లోన్‌, రుపీ కింగ్‌, ఎంఐ రుపీ, వన్‌లోన్‌ క్యాష్‌ ఎనీ టైం, ఎక్స్‌ప్రెస్‌ లోన్‌, లోన్‌ డ్రీమ్‌, రుపీ లోన్‌, ఫ్లాష్‌ లోన్‌ మొబైల్‌, రుపీ స్టార్‌, వావ్‌ రుపీ, క్యాష్‌ పార్క్‌ లోన్‌, హో క్యాష్‌, ఫస్ట్‌ క్యాష్‌, క్లియర్‌ లోన్‌, రుపీ బాక్స్‌, స్మాల్‌ లోన్‌, రిచ్‌, లోన్‌ గో, ఆసాన్‌ లోన్‌, లైవ్‌ క్యాష్‌, ఫాస్ట్‌ రుపీ, లోన్‌ ఫార్చ్యూన్‌, క్యాష్‌ ప్యాకెట్‌, ఇన్‌స్టా లోన్‌, అప్‌నా పైసా, కాయిన్‌ రుపీ, క్యాష్‌ అడ్వాన్స్‌, క్యాష్‌ పాపా, లోన్‌ క్యూబ్‌, హ్యాండ్‌ క్యాష్‌, లోన్‌ హోమ్‌ స్మాల్‌, ఐ క్రెడిట్‌, వెన్‌ క్రెడిట్‌, సమయ్‌ రుపీ, లెండ్‌ మాల్‌, సిల్వర్‌ ప్యాకెట్‌, భారత్‌ క్యాష్‌, మనీ మాస్టర్‌, ఈజీ లోన్‌, వార్న్‌ రుపీ, స్మార్ట్‌ కాయిన్‌, లక్కీ వ్యాలెట్‌, యూపీఓ లోన్‌, బడ్డీ లోన్‌, క్యాష్‌ మైన్‌, టైటో క్యాష్‌, మై క్యాష్‌ లోన్‌, సింపుల్‌ లోన్‌, క్యాష్‌ మిషన్‌ లోన్‌, ఫర్‌ పే, మినిట్‌ క్యాష్‌, ఫాస్ట్‌ పైసా, మోర్‌ క్యాష్‌, క్యాష్‌ బుక్‌, హ్యాండ్‌ క్యాష్‌ ఫ్రెండ్లీ లోన్‌, బెలోనో లోన్‌, కొకో లోన్‌, రిలయబుల్‌ రూపీ క్యాష్‌, ఎర్లీ క్రెడిట్‌ యాప్‌, ఈగిల్‌ క్యాష్‌లోన్‌ యాప్‌, క్యాష్‌ క్యారీ యాప్‌, క్యాష్‌ పార్క్‌, రిచ్‌ క్యాష్‌, ఫ్రెష్‌ లోన్‌, బెట్‌ విన్నర్‌ బెట్టింగ్‌, రుపీ మాల్‌, సన్‌ క్యాష్‌, మినిట్‌ క్యాష్‌, బస్‌ రుపీ, క్యాష్‌ లోన్‌, ఆన్‌స్ట్రీమ్‌, క్యాష్‌ లోన్‌, స్మాల్‌ లోన్‌, రుపీయా బస్‌, ఇన్‌స్టా మనీ, ైస్లెస్‌ పే, లోన్‌ క్యూబ్‌, ఐ కార్జా, మనీస్టాండ్‌ ప్రో, పోక్‌ మనీ, క్వాలిటీ క్యాష్‌, లోన్‌ లో జీ, ఫర్‌ పే యాప్‌, రుపీ ప్లస్‌, డ్రీమ్‌ లోన్‌, క్యాష్‌ స్టార్‌, మినీసో రుపీ, క్యాష్‌ పాల్‌, ఫార్చూన్‌ నౌ, క్రెడిట్‌ వ్యాలెట్‌, ప్యాకెట్‌ బ్యాంక్‌, లోన్‌ జోన్‌, ఫాస్ట్‌ కాయిన్‌, స్టార్‌ లోన్‌, ఈజీ క్రెడిట్‌, ఏటీడీ లోన్‌, ట్రీ లోన్‌, బ్యాలెన్స్‌ లోన్‌, క్యాష్‌ బౌల్‌, క్యాష్‌ కర్రీ, క్యాష్‌ మిషన్‌, క్యాష్‌ పాకెట్‌ లైవ్‌ క్యాష్‌, క్యాష్‌ కోలా, 66 క్యాష్‌, కోకో లోన్‌, లోన్‌ రిసోర్స్‌(డీసీ), క్యాష్‌ హోల్‌, ఈజీ బారో క్యాష్‌ లోన్‌, ఐఎన్‌డీ లోన్‌, వ్యాలెట్‌ పేఈ, క్యాష్‌ గురూ యాప్‌, గోల్డ్‌ క్యాష్‌, ఆరెంజ్‌ లోన్‌, యాంగిల్‌ లోన్‌, లోన్‌ సాతీ, షార్ప్‌ లోన్‌, డెయిలీ లోన్‌, స్కై లోన్‌, మో క్యాష్‌, జో క్యాష్‌, బెస్ట్‌ పైసా, హెలో రుపీ, హాలిడే మొబైల్‌ లోన్‌, ఫోన్‌ పే, ప్లంప్‌ వ్యాలెట్‌, క్యాష్‌ క్యారీ లోన్‌ యాప్‌, క్రేజీ క్యాష్‌, క్విక్‌ లోన్‌ యాప్‌, రాకెట్‌ లోన్‌, రుపీ మ్యాజిక్‌, రష్‌ లోన్‌, బెలోనో లోన్‌ యాప్‌, ఎగైల్‌ లోన్‌ యాప్‌, క్యాష్‌ అడ్వాన్స్‌ 1, ఇన్‌కమ్‌ ఓకే'

No comments:

Post a Comment