మూతపడిన కోయంబేడు మార్కెట్‌

Telugu Lo Computer
0



ఏడాది పొడవునా వ్యాపారులు, సరకుల దిగుమతులు, లోడు వాహనాలతో సందడిగా కనిపించే చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ గురువారం వాణిజ్య దినోత్సవం సందర్భంగా నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. మూడు వేలకు పైగా దుకాణాలకు సెలవు ప్రకటించడంతో అన్నీ మూతబడ్డాయి. చిల్లర విక్రయాలు మాత్రం యధావిధిగా సాగాయి. ప్రతి ఏటా మే 5వ తేదీ వాణిజ్య దినంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, నిత్యావసర దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు తదితరాలను మూసివేసి, వ్యాపారుల సంఘాల ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాపారులు తరలివెళుతుంటారు. ఈ ఏడాది వాణిజ్య దినోత్సవం సందర్భంగా కూరగాయలు, పండ్లు, పూలు, కిరాణా సరుకులు విక్రయించే కోయంబేడు మార్కెట్‌ను వ్యాపారుల సంఘాల సమాఖ్య పిలుపుమేరకు గురువారం మూసివేశారు. ఈ ప్రాంగణంలోని పూల మార్కెట్‌లో మాత్రం యధావిధిగా పూల విక్రయాలు జరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)