రాజ్యసభ బరిలో కె.లక్ష్మణ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 30 May 2022

రాజ్యసభ బరిలో కె.లక్ష్మణ్


బీజేపీ తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ లీడర్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఇలా వ్యవహరించిందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం యూపీ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. 1956 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్‌.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. మున్నురుకాపు వర్గానికి చెందిన లక్ష్మణ్‌ ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్‌ లో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరి.. 1995-1999 మధ్య పార్టీ హైదరాబాద్‌ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016-2020 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారిగా ఎన్నికల పోటీలో భాగంగా 1994లో ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున మొదటిసారిగా రాజ్యసభకు వెళ్తున్న నాయకుడు లక్ష్మణే కావడం విశేషం.

No comments:

Post a Comment