ఫోటోగ్రాఫర్ లేడని పెళ్లి క్యాన్సిల్ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని  కాన్పూర్ దేహత్ జిల్లా మంగళ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే రైతు కుమార్తెకు భోగ్నిపూర్ లో నివసిస్తున్న వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి కూతురు కుటుంబం జైమాల్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. వరుడు ఉరేగింపుతో రాగానే అందరూ కలిసి ఆహ్వానం పలికి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో జైమాల్ జరగాల్సి ఉండగా అబ్బాయి తరుఫు వాళ్ల బృందంలో ఫోటో గ్రాఫర్,వీడియో గ్రాఫర్ లేకపోవటం వధువు గమనించింది. దీంతో ఆమెకు కోపం వచ్చి తను ఆ పెళ్లి చేసుకోనని తేగేసి చెప్పింది. కళ్యాణ మండపం నుంచి దిగి పక్క ఇంటికి వెళ్లి అక్కడే కూర్చుంది. ఆమెను ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు. నాతో ఈరోజు జరిగే పెళ్లి గురించే పట్టించుకోని వాడు రేపు జీవితంలో నాగురించి పట్టించుకుంటాడా, నన్ను జీవితాంతం సంతోషంగా ఉంచగలుగుతాడా అంటూ ప్రశ్నించింది. వ్యవహారం చివరకు పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసుల మధ్యవర్తిత్వంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్న కానుకలు వెనక్కు తిరిగి ఇచ్చేశారు. అనంతరం పెళ్లి కూతురు లేకుండానే వరుడు వెనక్కి తిరిగి వెళ్లాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)