చియా పానీయం - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ చియా విత్తనాలు వేసి అరగంట అలా వదిలేస్తే గింజలు ఉబ్బి జెల్లీ మాదిరిగా తయారవుతాయి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె ,అరచెక్క నిమ్మరసం, 6 లేదా 7 పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పావుగంట అలా వదిలేయలి. ఆ తర్వాత అవసరమైతే ఐస్ క్యూబ్ వేసుకొని తాగాలి. చియా విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాల్షియం, మాంగనీస్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, పాస్పరస్, విటమిన్ బి1, బి2, బి3 ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటి వల్ల బరువు తగ్గుతారు. అలాగే అలసట,నీరసం తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. నొప్పులను తగ్గిస్తుంది. పుదీనా చెడు కొలెస్ట్రాల్ లేకుండా అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ నీరసం, అలసటను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ రోజు తాగవచ్చు.లేదా రోజు విడిచి రోజు తాగవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)