ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగు

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లా  మనేంద్రగఢ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెల్గావ్ గ్రామంలో గులాబ్ సింగ్ గోండ్ అనే వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి అడవి ఏనుగు ప్రవేశించి అతనిని, అతని ఆరేళ్ల కుమార్తె షానును తొక్కి చంపినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) లోక్‌నాథ్ పటేల్ తెలిపారు. ఏనుగు నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేసిందని, స్థానికులు అక్కడికి వచ్చి ఏనుగులను తరిమికొట్టారని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు వచ్చిందని, అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారని అన్నారు. 10 ఏనుగుల గుంపు మీ ప్రాంతంలోకి వస్తుందని లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామస్థులను అప్రమత్తం చేయటం జరిగిందని, అయితే చనిపోయిన వారి ఇల్లు అడవిలో ఉన్నందున వారి కుటుంబానికి సమాచారం అందలేదని పటేల్ తెలిపారు. ఏనుగు దాడిలో గాయపడిన మృతుల కుటుంబీకులకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 25,000 అందించామని, మిగిలిన పరిహారం అవసరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత పంపిణీ చేయబడుతుందని అధికారి తెలిపారు. సుర్గుజా, జష్‌పూర్, కొరియా, బలరామ్‌పూర్, సూరజ్‌పూర్ జిల్లాలతో పాటు బిలాస్‌పూర్ డివిజన్‌లోని కోర్బా, రాయ్‌ఘర్‌లోని ప్రాంతాలతో కూడిన సర్గుజా డివిజన్‌లో ఏళ్ల తరబడి ఏనుగుల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏనుగుల దాడితో అనేక మంది ప్రాణాలుసైతం కోల్పోయారు. ఆస్తి నష్టానికి ఏనుగులు కారణమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)