ఢిల్లీలో కుండపోత వర్షం

Telugu Lo Computer
0


ఢిల్లీలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ గాలులతో చెట్లు విరిగిపడిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రయాణికులు ఎప్పటికపుడు తన విమానాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత అధికారులతో టచ్‌లో ఉండాలని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షంతో పాటు గాలులు బలంగా వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని వారు ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)