రూ. 10 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 31 May 2022

రూ. 10 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు !


తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డాక్టర్ ఎం ప్రదీప్​, అతని బంధువు ఎన్ రమేశ్​కు కేరళలో రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్‌ వద్ద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్‌పాట్‌ తగిలింది. డ్రాలో వీరి టికెట్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్​కు వెళ్లి టికెట్​తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు.

No comments:

Post a Comment